లయిచణ నాయక్‌కు ఘనంగా నివాళులు
జయపురం: స్వాతంత్య్ర సమర యోధుడు జయపురం విధానసభ ప్రథమ ఎమ్మెల్యే దివంగత లయిచణ నాయక్ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయపురం 26వ జాతీయ రహదారి జిల్లా లేబర్ కార్యాలయం కూడలి వద్ద లయిచణ నాయిక్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ న్యాయవాది, ప్రముఖ కాంగ్రెస్ నేత మదన మోహణ నాయిక్ మాట్లాడుతూ.. లయిచణ నాయక్ అవిభక్త కొరాపుట్‌లో జరిగిన దేశ స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొని ప్రజలను చైతన్య పరిచారని, దేశ స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952లో జరిగి మొదటి ఎన్నికలలో ఆయన జయపురం నియోజకవర్గం నుంచి ఒడిశా విధానసభకు ఎన్నికయ్యారని వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఆయన జయపురం ఉన్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. స్వర్గీయ లయిచణ నాయక్ కుమారుడు, కొరాపుట్ జిల్లా కాంగ్రస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు రామ నాయిక్, పాత్రికేయుడు రాజేంద్రకుమార్ గౌఢ, రబినారాయణ నందో, పరమేశ్వర పాత్రో, ప్రమోద్ రౌళో, ఖొలి పట్నాయక్, పూజ్య పూజసంసద్ కార్యదర్శి బైరాగి సాహు, సురేంద్రఖొర, చంద్రమణి బారిక్, ప్రఫుల్లగౌఢ, తులసీదాస్ ఖొర, నరేష్ మహకూల్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ‘అమో బస్సులు’ నడపాలి
పర్లాకిమిడి : ఒడిశా ఆర్టీసీ బస్సులు కాశీనగర్ బ్లాక్‌లో కె.సీతాపురం మీదుగా ఆల్ ఒడిశా రోడ్డు రూట్‌లో కాకుండా హడ్డుబంగి, బలద(శ్రీకాకుళం జిల్లా), కురిగాం మీదుగా కాశీనగర్‌కు నడుపుతున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గజపతి జిల్లా అధ్యక్షుడు పైల మురళీకృష్ణ ఆర్.టి.ఓ.కు ఫిర్యాదు చేశారు. తక్కువ చార్జీలతో నడుపుతున్న ఒడిశా బస్సులు ’అమొ బస్’ కూడా గుమ్మ, పురుటిగుడ గ్రామాలకు నడపకుండా సాధారణ రూట్లలో నడుపుతుండటంతో ఆదివాసీ, గిరిజన మహిళలు ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లయిచణ నాయక్‌కు ఘనంగా నివాళులు


