రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా అనుగార్గ్
భువనేశ్వర్ : సీనియర్ ఐఏఎస్ అధికారి అనూగర్గ్ బుధవారం ఒడిశా 47వ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. స్థానిక లోక్ సేవా భవన్‌లో పదవీ విరమణ చేస్తున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనూ గర్గ్ ఒడిశా పురోగతి పట్ల తన నిబద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూపొందించిన వికసిత ఒడిశా, వికసిత భారత్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సమష్టి ప్రయత్నాలు, మహిళా సాధికారత, యువత సాధికారత, వ్యాపార సౌలభ్యాన్ని అందుబాటులోకి తేవడం ప్రముఖ అంశాలుగా పేర్కొన్నారు.
రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా అనుగార్గ్


