ఫుట్‌బాల్ చాంపియన్‌గా గిర్లా
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి గిర్లా పంచాయతీ సమితి అంకలా గ్రామంలో ఈ నెల 11వ తేదీ నుంచి జరుగుతున్న మాఠకురాణి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గిర్లా పంచాయతీ టీమ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో 16 టీమ్‌లు పాల్గొన్నాయి. వాటిలో గిర్లా పంచాయతీ టీమ్, జయపురం సమితి మొకాపుట్ పంచాయతీ టీమ్‌లు ఫైనల్‌కు చేరాయి. ఆ రెండు టీమ్‌లు సోమవారం ఫైనల్‌లో తలపడ్డాయి. టోర్నమెంట్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తపన్ కుమార్ పాణిగ్రహి, బహమతుల ప్రదాన ఉత్సవంలో ముఖ్యఅతిథిగా కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, గౌరవ అతిథిగా కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర మఝి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. విన్నర్ టీమ్ కు రూ.25 వేల నగదు, రన్నర్ టీమ్‌కు రూ.20 వేల నగదు, ట్రోఫీలు అందజేశారు. మాజీ మంత్రి శ్రీమతి పద్మిణీ దియాన్, జిల్లా పరిషత్ సభ్యులు గీతా మఝి, త్రిపతి కొట్‌పాడ్ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ యువనేత కురుమ్ నాథ్ మఝి, సమితి అధ్యక్షులు కమల భొత్ర, గిర్లా సర్పంచ్ జగన్‌మోహన్ మఝి పాల్గొన్నారు.


