సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోండి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఉన్న మత్స్యకారులు, పాడి రైతులందరికీ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలు చేరాలని మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో అన్నారు. ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి స్థానిక గజపతి స్టేడియంలో జిల్లా స్థాయి మత్స్య, ప్రాణిసంపద మేళాను ప్రారంభించారు. ఆయనతో పాటు మరో అతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, కలెక్టర్ మునీంద్ర హానగ, జిల్లా ముఖ్య వెటర్నరీ అధికారి డాక్టర్ తుషార్ చంద్ర నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి నిరోద్‌చంద్ర నాయక్, సెంచూరియన్ వర్సిటీ డీన్(వెటర్నరీ, ఫిషరీస్), డాక్టర్ రాజ్‌కిషోర్ స్వయిని తదతరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో మహిళా గ్రూపులు, పాడి రైతులు, మత్స్యకారులు ముఖ్యమంత్రి మత్స్య జీడి కల్యాణ యోజన పథకం, వారి పిల్లలకు ఉన్నత చదువులకు భృతి సద్వినియోగం చేసుకోవాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కోరారు. పశుపాలన, నాటు కోళ్లు, లేయర్ ఫారంలు, గోర్రెలు, పెంపకం ద్వారా మహిళలు ఆర్ధిక స్వావలంబన జరుగుతుందని జిల్లా ప్రాణిసంపద అధికారి డాక్టర్ తుషార్ చంద్ర నాయక్ అన్నారు. అనంతరం గజపతి స్టేడియంలో వివిధ జాతి పశువులు, చేపల పెంపకం, వాటి ఆహారం, చంద్రగిరిలో పట్టు పరిశ్రమ, ట్రసర్ ఉత్పాదన, ప్రభుత్వ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, సెంచూరియన్ వర్సిటీ పశుసంపద, పాలకేంద్రాల స్టాల్స్‌ను ఎమ్మెల్యేలు దాశరథి, రూపేష్ పాణిగ్రాహిలు కలియతిరిగి వారితో ముచ్చటించారు. అనంతరం కోంతమంది మత్స్య, పాడి రైతులకు జిల్లా కలెక్టర్ మునీంద్ర హానగ బహుమతులు ఇచ్చి సత్కరించారు. రెండు రోజుల పాటు మత్స్య, పశుసంపద మేళా స్టేడియంలో జరుగుతుందని అధికారులు తెలియజేశారు.
గజపతి స్టేడియంలో మత్స్య,పశుసంపద మేళాను ప్రారంభిస్తున్న పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి
సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోండి
సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోండి


