విదేశీ నకిలీ మద్యం కర్మాగారం గుట్టురట్టు
–8లోu
గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆమోదం పొందిన ఒడిశా శకటం
జయపురం: రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ ఆఫ్ ఒడిశా పి.అనేష్ రెడ్డి, కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ ఆదేశం మేరకు జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్య రెడ్డి, కొరాపుట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అబకారి అధికారి అరుణ కుమార్ పాఢి పర్యవేక్షణలో... సోమవారం జయపురం అబ్కారీ ఇన్‌స్పెక్టర్ శశికాంత భట్ అబకారీ సిబ్బంది మెజిస్ట్రేట్ కొట్‌పాడ్ తహసీల్దార్ ట్వంకెల్ సెట్టి సమక్షంలో కొట్‌పాడ్ పోలీసు స్టేషన్ పరిధి బొండాగుడలో వివిధ రకాల విదేశీ మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని పట్టుకున్నారు. రూ.20 లక్షలకు పైగా విలువ చేసే విదేశీ నకిలీ మద్యం పట్టుకున్నారు. అలాగే వివిద కంపెనీల నకిలీ లేబుళ్లు, రసాయనిక ద్రవ్యాలను పట్టుకున్నట్లు జయపురం అబ్కారీ అధికారులు తెలిపారు. ఈ కర్మాగారాన్ని మచెల్‌మాల్ గ్రామానికి చెందిన అమిత్ గుప్త, పినాకజీ గుప్త నడుపుతున్నారని వెల్లడించారు. ఈ దాడుల్లో రోయల్ స్టేజ్ సుపీరియర్ విస్కీ 180 ఎంఎల్ 1248 బాటిల్స్, రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ 180 ఎంఎల్ 478 బాటిల్స్, రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ 375 ఎంఎల్ 44 బాటిల్స్, స్టెర్లింగ్ రిజర్వ్ బి–7 విస్కీ 180 ఎంఎల్ 716 బాటిళ్లు, 375 ఎంఎల్ 44 బాటిల్స్, మెక్‌డొవెల్ నంబర్ 1 డీలక్స్ విస్కీ 180 ఎంఎల్ 3870 బాటిళ్లు,375 చఎల్ 24 బాటిళ్లు,గోవా స్పెషల్ విస్కీ(ఛత్తిషఘడ్)180 యం.ఎల్ 144 బాటిళ్లు, రోయల్ స్టేజ్ విస్కీ (కంపెనీ లేబుల్లు కేకుండా)1896తో పాటు అనేక మద్యం సీసాలు, రసాయనాలు పట్టుకున్నారు.
విదేశీ నకిలీ మద్యం కర్మాగారం గుట్టురట్టు
విదేశీ నకిలీ మద్యం కర్మాగారం గుట్టురట్టు
విదేశీ నకిలీ మద్యం కర్మాగారం గుట్టురట్టు


