విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
పర్లాకిమిడి: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, బీపీఎల్ లబ్ధిదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంటు డబుల్ ఇంజిన్ సర్కారు అమలు చేయలేదని, టాటా.విద్యుత్ కంపెనీ ఆదనపు సెక్యూరిటీ డిపోజిట్ కట్టాలన్న నిబంధన వెనిక్కితీసుకోవాలని, స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు జబర్‌దస్తీగా బిగించరాదని డీసీసీ అధ్యక్షులు, మోహానా ఎమ్మెల్యే దాశరథి గొమాంగో డిమాండ్ చేశారు. గజపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టాటా పవర్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టి.పి.యస్.ఓ.డి.ఎల్.) ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కార్యాలయాన్ని తాళాలు వేస్తామని హెచ్చరించారు. స్మార్ట్‌మీటర్లు ఇళ్లకు బిగించరాదని, వీటిలో విశ్వసనీయత లేదని, కరెంటు చార్జిల బిల్లులు అధికంగా వస్తున్నాయని అన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ఈఈ కార్యాలయంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుకు పది డిమాండ్ల పత్రాన్ని అందజేశారు. ఆందోళనలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బసంత పండా, సూర్య నారాయణ పాత్రో, సంగ్రాం సాహు, మాజీ కౌన్సిలర్ అభిమన్యు పండా పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి


