ఇద్దరు బాలికలను రక్షించిన పోలీసులు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి ఎంవీ 47, 58 గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి ఆంధ్రాకు తరలించారు. విషయం తెలుసుకున్న కోరుకొండ ఐఐసీ ఆర్.విజయ్ కుమార్ తన సిబ్బందిని పంపించి ఆంధ్రా అమరావతి నుంచి బాలికలను సురక్షితంగా సోమవారం మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఘటనలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నెల 18న మల్కన్‌గిరికి చెందిన మదన్ మోహన్ బల్లన్, ఎంపీవీ 78 గ్రామానికి చెందిన అజయ్ ఘోష్, పవన్ మండల్ ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. బాలికలను ఇక్కడ నుంచి తీసుకెల్లి అమరావతిలో ఓ నిర్మాణ భవనం వద్ద ఉంచారు. విషయం తెలుసుకుని బాలికల కుటుంబ సభ్యులు కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసు దర్యాప్తులో బాలికలు ఆంధ్రాలో ఉన్న విషయం తెలిసింది. దీంతో ఇక్కడ నుంచి ఐఐసీ ఆర్.విజయ్, ఎస్‌ఐ ప్రశాంత్ బాలికలను సురక్షితంగా తీసుకువచ్చారు. నిందితులపై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచారు. బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు.


