ఎలుగుబంట్ల అలజడి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి టిగాల్, కోయిమేట్ల పంచాయతీల పరిధిలోని గ్రామాల్లోకి ఎలుగుబంట్లు విచ్చలవిడిగా చొరబడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటిపడితే ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం రాత్రీ యం.వి.65 గ్రామంలోని ఓ ఇంటి ముందుకు ఎలుగుబంటి వచ్చిన దృశ్యం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఎలుబంటి వచ్చిన దృశ్యాన్ని సోమవారం సీసీ కెమెరాలో చూడి ఆందోళ చెందారు. అటవీ అధికారులు దృష్టిసారించి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల
భువనేశ్వర్: గత 24 గంటల్లో రాజధాని నగరం భువనేశ్వర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకూ పెట్రోల్ ధర లీటరు రూ. 101.19 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76గా ఉంది. అయితే గత 24 గంటల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 0.8 పైసలు వంతున పెరిగాయి. కటక్ నగరంలో గత 24 గంటల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఈ నెల 29న పెట్రోల్ ధర లీటరుకు రూ.101.32 ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ.92.88గా ఉంది. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో ఇంధన ధరలు 0.26 పైసలు తగ్గాయి.


