ఘనంగా 78వ జాతీయ ఎన్‌సీసీ రైజింగ్ డే వేడుకలు
పర్లాకిమిడి: 78వ జాతీయ ఎన్‌సీసీ రైజింగ్ డే వేడుకల సందర్భంగా పర్లాకిమిడి శ్రీకృష్ణచంద్ర గజపతి (స్వయంప్రతిపత్తి) కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధాకాంత భుయ్యాన్ ఎన్‌సీసీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. జూలై 15, 1948లో ఎన్‌సీసీ వాహినీని భారత్‌లో ప్రవేశపెట్టిందని, దేశ సమైక్యత, క్రమశిక్షణ, శారీరకంగా ధృఢత్వం, సేవా ధృక్పథంతో జాతీయ సమర శిక్షా వాహిని పనిచేస్తుందని ఆయన తన ప్రసంగంలో అన్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థుల పరేడ్ నిర్వహించారు. కళాశాలలో ఎన్‌సీసీ సమర శిక్షా వాహినీ పదాతి దళం గౌరవ వందనాన్ని ప్రిన్సిపల్ రాధాకాంత భుయ్యాన్ స్వీకరించారు. వేడుకల్లో ఎన్‌సీసీ లెఫ్టినెంట్ కుషాల్ కన్హర్, వందమంది ఎన్‌సీ జూనియర్, సీనియర్ సేవా వాహినీ, ఇతర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా 78వ జాతీయ ఎన్‌సీసీ రైజింగ్ డే వేడుకలు
ఘనంగా 78వ జాతీయ ఎన్‌సీసీ రైజింగ్ డే వేడుకలు


