దత్తత స్వీకరణపై అవగాహన రథం ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం దత్తత స్వీకరణ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని రథాన్ని ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ మాట్లాడుతూ ఈ రథం జిల్లాలోని కలిమెల, మత్తిలి, కోరుకొండ, ఖోయిర్‌పూట్, చిత్రకొండ, పోడియ, మల్కన్‌గిరి సమితుల్లోని పంచాయతీల్లో పర్యటిస్తుందని తెలిపారు. సంతానం లేని వారు పిల్లలను ఎలా దత్తత తీసుకోవాలో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖాధికారి నరేష్ సభరో, జిల్లా డీఐపీఆర్ అధికారి ప్రమిళా మాఝి, జిల్లా శిశు సంరక్షణ అధికారి నారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు.


