మునిగుడలో మహాలక్ష్మి పూజలు ప్రారంభం
రాయగడ: మునిగుడలోని పాయికోవీధి వద్ద మహాలక్ష్మి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం సమీపంలోని నగావళి నది నుంచి శుద్ధ జలాలు తీసుకువచ్చిన పురోహితులు మండపాన్ని శుభ్రపరిచారు. శనివారం నుంచి అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ ఏడో తేదీ వరకు పూజలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. 38 ఏళ్లుగా మహాలక్ష్మి పూజలను నిర్వహిస్తున్నామని పురోహితుడు జగబంధు పండ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ ఆకట్టుకుంటుంది. రోజూ సమీప గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీనా బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మునిగుడలో మహాలక్ష్మి పూజలు ప్రారంభం


