ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణ
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025
నువాపడా ఉప ఎన్నికలో..
● ఎన్నికల సంఘానికి బీజేడీ ఫిర్యాదు
భువనేశ్వర్: ఇటీవల ముగిసిన నువాపడా శాసన సభ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ ఎత్తున ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిందని బిజూ జనతా దళ్ (బీజేడీ) ఆరోపణ. ఈ నేపథ్యంలో అధికారికంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ను సంప్రదించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అధ్యక్షతన నవీన్ నివాసంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో నువాపడా ఉప ఎన్నికలో ఫలాఫలాలపై లోతుగా చర్చింది. ఎన్నికలో ఈవీఎంల అక్రమాలు తుది ఫలితాలు ప్రభావితం చేశాయని తీర్మానించారు. ఈ తీర్మానం ప్రకారం భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని నిర్ణయించినట్లు బీజేడీ సీనియర్ నాయకురాలు, ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ విలేకరులకు తెలిపారు. నువాపడా ఉప ఎన్నిక అంశాలపై పీఏసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడితో జరిగిన చర్చలో ఉప ఎన్నికలో విజయం సాధించడానికి బీజేడీ ఓట్లను బీజేపీ స్వాధీనం చేసుకోవడంలో ఈవీఎంల అక్రమాలు ప్రధానాంశంగా నిలిచిందన్నారు.
నువాపడాలో ఈవీఎం ట్యాంపరింగ్, డబ్బు, కండ బలం, యంత్రాంగం దుర్వినియోగంతో బీజేడీ ఓట్లను కై వసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఈ ఎన్నికలో గెలుపు సొంతం చేసుకుందన్నారు. ప్రధానంగా 63 కేంద్రాల్లో బీజేడీ ఓట్లు గల్లంతు చేసిందని, ఫలితాలు ప్రకటించడానికి ముందు పార్టీ ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని కలిసి ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఫిర్యాదులు సమర్పించిందని మల్లిక్ తెలిపారు. బీజేడీ స్వయంగా విచారణ నిర్వహించి ఈవీఎం ట్యాంపరింగ్‌ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా కుప్ప కూల్చేందుకు బీజేపీ కుతంత్రాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అట్టడుగు స్థాయిలో బీజేడీ బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఈ నెలలో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాల్లో ప్రముఖ ప్రజా సమస్యలను ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించారు. వ్యూహాత్మకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని సభలో ఎండగట్టాలని పీఏసీ తీర్మానించింది.
ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణ


