స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
భువనేశ్వర్: శీతాకాల సమావేశాలు పురస్కరించుకుని స్పీకర్ అధ్యక్షతన ఈ నెల 26న అఖిల పక్ష సమావేశం జరగనుంది. శీతా కాలం సమావేశాలు ఆద్యంతం సజావుగా కొనసాగించడంలో అఖిల పక్షాలను అభ్యర్థించడం ఈ సమావేశం లక్ష్యం. ఈ నెల 27న శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 27న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభలో ప్రసంగిస్తారు. 28న అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నాయి.
ఘనంగా లక్ష్మణ నాయిక్ జయంత్యుత్సవం
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వ విద్యాలయంలో సహిద్ లక్ష్మణ నాయిక్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఫ్రొఫెసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మిశ్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి మహేశ్వర చంద్ర నాయిక్, స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్యవక్తగా డాక్టర్ విజ య కుమార్ మిశ్ర ప్రసంగిస్తూ స్వాతంత్య్ర పో రాటంలో ఒడిశాలో అనేక మంది యోధులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అలాంటి వారిలో ఆదివాసీ నేత లక్ష్మణ నాయిక్ ప్రత్యేకంగా చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో మరో వక్తగా ప్రముఖ ఆదివాసీ పరిశోధకులు డాక్టర్ రాజేంధ్ర పాఢీ, ఒడిశా స్వాతంత్య్ర సమరంలో సహిద్ లక్ష్మణ నాయిక్ భూమిక పై ప్రసంగించారు.


