అదరగొట్టిన విద్యార్థులు
జయపురం: జయపురం ప్రధాన మంత్రి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జయపురం బ్లాక్ స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025 విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది. జయపురం బ్లాక్ విద్యాధికారి చందన నాయిక్ హర్షధ్వనుల మధ్య ప్రదర్శనను ప్రారంభించారు. స్టెమ్ పేరుతో నిర్వహించిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరిగ్ మేథమెటిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల నుంచి ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 200 లకు పైగా వివిధ అంశాలపై విజ్ఞాన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఉదయం ప్రారంభించిన రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవంలో హెచ్‌ఎం ప్రకాశ పట్నాయిక్, సహచర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు ఉత్సవంలో ముఖ్యఅతిథిగా జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన, జయపురం అగ్నిమాపక విభాగ సహాయ అధికారి సురేష్ కుమార్ బారిక్, బ్లాక్ విద్యాధికారి చంధన నాయిక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ చంద్ర పట్నాయిక్, అదనపు బీఈఓ కె.గోపాల్, సొల్ప గ్రామ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివరాం పాణిగ్రహి పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో మొదటి స్థానం పొందిన ప్రాజెక్టులను జిల్లాస్థాయి పోటీలకు పంపిస్తామని ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ పట్నాయిక్ వెల్లడించారు. ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రీతి ప్రధాన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి సంజిత్ భూమియ, ఎకంబా ఉన్నత పాఠశాల విద్యార్థి శ్రీధర స్వైయ్, జయపురం సిటీ స్కూలు విద్యార్థిని సి.హెచ్.సుప్రియ, పూజారిపుట్ ఉన్నత పాఠశాల విద్యార్థి కవితా దాస్, కలియగాం ఉన్నత పాఠశాల విద్యార్థిని రక్ష్మిత ముదులి, జయపురం పీఎం ఉన్నత పాఠశాల విద్యార్థి ఆదిత్య ప్రసాద్ పాణిగ్రహి ప్రథమ బహుమతులు పొందారు.
అదరగొట్టిన విద్యార్థులు
అదరగొట్టిన విద్యార్థులు
అదరగొట్టిన విద్యార్థులు
అదరగొట్టిన విద్యార్థులు
అదరగొట్టిన విద్యార్థులు
అదరగొట్టిన విద్యార్థులు
అదరగొట్టిన విద్యార్థులు


