ఘనంగా రాణి లక్ష్మీబాయ్ జయంతి
జయపురం: అఖిల భారత విద్యార్థి పరిషత్ జయపురం శాఖ స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో విక్రమదేవ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మిశ్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ విక్రమ్ విశ్వ విద్యాలయ అధ్యక్షులు జ్యోతీ రంజన్ పాణిగ్రహి ఆహ్వానం మేరకు నిర్వహించిన లక్ష్మీభాయి జయంతిలో ముఖ్యఅతిథి ప్రసంగిస్తూ ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీభాయ్ జరిపిన స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ స్నాతకోత్తర పరిషత్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత పాత్రో, ఒడియా విభాగ చీఫ్ సుకాంత సాయ్ ముఖ్యవక్తగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థినుల గ్రూపులో మానసీ రాణి మహంతి ప్రథమ, చంపామణి భొత్ర ద్వితీయ, జ్యోతిర్మయి మిశ్ర తృతీయ స్థానాఆల్లో నిలిచారు. అలాగే విద్యార్థుల గ్రూపులో అక్షయ మహాపాత్రో ప్రథమ, రతీకాంత ప్రధాన్ ద్వితీయ, రాహుల్ బాగ్ తృతీయ స్థానాలు పొందారు. పోటీల నిర్వహణను అధ్యాపకులు లోకేష్ ప్రధాన్, అఖిల భారత విద్యాపరిషత్ కార్యదర్శి మనోజ్ సాహు, శుభమ్ నాయిక్, జగన్నాథ్ ఖొర, టి.ప్రతీక్, దీపక్ దొర, సత్యంజయ బిశాయి, రింకి హరిజన్, మధుశ్మిత ప్రధాన్, పరశురాం గొలారి, ఘాశీరాం హియాల్, ఎస్.కౌశిక్ రావులు పర్యవేక్షించారు.


