ఠకురాణి మందిరం అభివృద్ధికి రూ. లక్ష విరాళం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ పట్టణంలో ఉన్న ఠకురాణి మందిరం అభివృద్ధి పనుల కోసం పట్టణానికి చెందిన ఐ.యుగంధర్ లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మందిరం పరిశీలన కమిటీ అధ్యక్షుడు ఎస్.బాబా ప్రసాద్‌రావుకు శుక్రవారం అందించారు. ఇప్పటి వరకు విరాళాల రూపంలో మందిరం అభివృద్ధి కోసం ఏడు లక్షల 86 వేల రూపాయలు దాతలు ఇచ్చారని బాబా ప్రసాద్ వెల్లడించారు. లభించిన విరాళాలల్లో ఇప్పటికి మందిరం అభివృద్ధి పనులకు 4.15 లక్షల రూపాయలు ఖర్చు జరిగినట్టు పేర్కొన్నారు. మందిర పనులు పూర్తవ్వడానికి సుమారు కోటి రూపాయలు అవసరముందని.. అందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
జగన్నాథుని సన్నిధిలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
భువనేశ్వర్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూరీలోని జగన్నాథస్వామి ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్నాథుని దర్శన భాగ్యం స్వామి అనుగ్రహంతో మాత్రమే సాధ్యమన్నారు. జగన్నాథుని క్షేత్రం భక్తి, విశ్వాసాల కేంద్రంగా అభివర్ణించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా స్వామివారి మందిరాన్ని సందర్శించారు. అందరి శ్రేయస్సు కోసం స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఘనంగా హరేకృష్ణ మహతాబ్ 126వ జయంతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఉన్న బెంగాలీ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉత్కళ కేశరి హరేకృష్ణ మహతాబ్‌కు జిల్లా డిఐపీఆర్ అధికారి ప్రమిళ మాఝి నివాళులర్పించారు. హెచ్‌ఎం హరికృష్ణ బారిక్ అధ్యక్షత వహించారు. ముఖ్యంగా హరేకృష్ణ మహతాబ్ గాంధేయవాది. స్వాతంత్య్ర సమర యోధుడు. రాష్ట్రనేత, దౌత్యవేత్త, చరిత్రకారుడు, శిశు సాహిత్య రచయిత, నవలా రచయిత, కవి, నాటక కర్త, వ్యాసకర్తగా కూడా రాణించారని వక్తలు పేర్కొన్నారు.
బాధ్యతల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ కుమార్ జెన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రమేష్ చంద్ర సాహు బదిలీ అనంతరం, సుమారు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ప్రభుత్వం డాక్టర్ జెన్నను నియమిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జెన్నకు గుణుపూర్ పట్టణ ప్రముఖులు, సబ్ డివిజన్ హాస్పిటల్ సిబ్బంది అభినందించారు.
అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేటింగ్ కార్యదర్శిగా శ్రీనివాస్ పట్నాయిక్
జయపురం: జయపురంలో ప్రముఖ క్రీడాకారుడు, క్రీడా శిక్షకులు శ్రీనివాస పట్నాయిక్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. గతంలో పట్నాయిక్ ఒడిశా రాష్ట్ర అథ్లెటిక్ అసోషియేషన్ అధ్యక్షులుగా ఉండేవారు. అలాగే ఆయన గతంలో ఒలింపిక్ టీమ్ మేనేజర్‌గానూ పనిచేశారు.
ఠకురాణి మందిరం అభివృద్ధికి రూ. లక్ష విరాళం
ఠకురాణి మందిరం అభివృద్ధికి రూ. లక్ష విరాళం
ఠకురాణి మందిరం అభివృద్ధికి రూ. లక్ష విరాళం


