
ఉప్పలాడ గ్రామంలో మూడు షాపుల్లో చోరీ
పర్లాకిమిడి: పర్లాకిమిడికి పది మైళ్ల దూరంలో ఉన్న ఉప్పలాడ గ్రామంలో గత రాత్రి రెండు కిరాణా, ఒక ఇంగ్లిష్ మందుల షాపుల్లో దొంగతనం జరిగి సుమారు రూ.45 వేలు దోపిడీకి గురైందని ఉప్పలాడ వ్యాపారి జి.సంతోష్ కుమార్ గురండి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గుసాని సమితి ఉప్పలాడ గ్రామంలో గురువారం రాత్రి వరుసగా మూడు షాపుల తాళాలు విరగ్గొట్టి, గేట్లు కత్తిరించి షాపులో ఉంచిన నగదును కాజేసినట్లు వ్యాపారులు ఫిర్యాదు చేశారు. ఉప్పలాడ గ్రామంలో జి.సంతోష్‌కుమార్ గత రాత్రి పదిగంటలకు షాపును మూసివేశాడు. ఉదయం షాపు తలుపులు తెరిచి ఉండటంతో గల్లా పెట్టె చూడగా నగదు కనిపించలేదు. ఈ కిరాణా షాపులో ఉంచిన నగదు రూ.25 వేలు పోయిందని చెప్పాడు. మూడు షాపుల వ్యాపారుల ఫిర్యాదు మేరకు గురండి పోలీసు ఐఐసీ ఓం నారాయణ పాత్రో ఉప్పలాడ విచ్చేసి కేసును దర్యాప్తు చేపట్టారు.

ఉప్పలాడ గ్రామంలో మూడు షాపుల్లో చోరీ