
10 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కంగుర్‌కొండ పంచాయతీకి చెందిన భీమా మడ్కమి అనే వ్యక్తి ఇంటి గోడ వద్ద పది అడుగుల కొండ చిలువ గురువారం రాత్రి కనిపించింది. భార్య చూసి కేకలు వేయడంతో వెంటనే భీమా కలిమెల అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం తో రెంజార్ విజయ్ కుమార్ నాయిక్ తన సిబ్బంది, స్నేక్‌హెల్ప్‌లైన్ సభ్యుడు రాకేష్ హల్దార్‌తో వచ్చి రెండు గంటలు శ్రమించి పామును పట్టుకున్నారు. కోళ్లను తినడానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం పామును రాకేష్ అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు.

10 అడుగుల కొండచిలువ పట్టివేత