
ఘనంగా లలితా దేవి పూజలు
పూజల్లో మహిళలు
జయపురం: జయపురంలోని పలు దేవాలయాలలో శ్రావణ ఆఖరి శుక్రవారాల పూజలతో పాటు శ్రీలలితా దేవి పూజలు భక్త శ్రద్ధలతో మహిళలు చేశారు. ఉదయం నుంచే మహిళలు దేవాలయాలలో దేవతామూర్తులకు పూజలు చేసేందుకు క్యూ కట్టారు. స్థానిక పూర్ణఘడ్‌లో లలితాదేవి ఆలయంలో వందలాది మంది మహిళలు దేవిలలితా దేవికి పూజలు జరిపారు. ఆలయ పూజారి సూర్యనారాయణ పంతులు ఈ రోజు ప్రాధాన్యత లలితా దేవి చరిత్ర భక్తులకు తెలిపి మహిళలచే పూజలు జరిపించారు. జయపురం పట్టణం జమాల్ లైన్‌లో వెంచేసి ఉన్న శ్రీరామ మందిరంలో లలితాంబిక దేవికి అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజలు వేడుకగా జరిపారు. పూజారులు అన్నవరపు కోటేశ్వర శర్మ, ఉరిమిలి నాగేశ్వరరావు పంతులు భక్తులచే పూజలు చేయించారు.

ఘనంగా లలితా దేవి పూజలు