
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత ● దుప్పిలపాడులో విషాదఛాయలు
టెక్కలి రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణస్నేహితులు దుర్మరణం పాలైన ఘటన కోటబొమ్మాళి మండలం శ్రీపురంలో గురువా రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కోటబొమ్మాళి మండలం దుప్పిలపాడుకు చెందిన సబ్బి అప్పన్న (35) హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. కొద్ది రోజుల కిందటే స్వగ్రామం వచ్చాడు. గురువారం అత్తవారి గ్రామమైన పాకివలస వెళ్లాడు. అక్క డ స్నేహితుడు పిట్ట గంగయ్య(32)తో కలిసి సమీపంలోని తర్లిపేటలో ఉన్న దాబాకు వెళ్లా రు. భోజనం చేశాక తిరిగి పాకివలస వస్తుండ గా శ్రీపురం సమీపంలో ద్విచక్ర వాహనం అదు పు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. హెల్మెట్లు లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్క డే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరా లు నమోదు చేశారు. మృతదేహాలను శవపంచనామ నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అప్పన్న కు భార్య లావణ్య, పిల్లలు ప్రియాంక, హారిక, మణికంఠ ఉన్నారు. గంగయ్యకు భార్య వాణిశ్రీ, పిల్లలు నిఖిల్, దీక్షిత్ ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

మృత్యువులోనూ వీడని స్నేహబంధం