
పశ్చిమ బెంగాల్ దంపతులకు మగ శిశువు దత్తత
పర్లాకిమిడి: ప్రభుత్వ స్వతంత్ర శిశు దత్తత కేంద్రం నుంచి 73వ శిశువును గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత చేతులమీదుగా గురువారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు అప్పగించారు. స్థానిక కేంద్ర ప్రభుత్వ పెద్దాసుపత్రి క్రెడాల్ కేంద్రం వద్ద గుర్తు తెలియని తల్లి ఒక శిశువును వదిలి వెళ్లిపోయింది. జిల్లా చైల్డ్ లైన్, జిల్లా స్వతంత్ర దత్తత కేంద్రం వారు చేరదీసి సపర్యలు చేశారు. అనంతరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు సంతాన దత్తత కేంద్రంలో పెంచారు. కేంద్ర దత్తత పోర్టల్‌లో చూసిన పశ్చిమ బెంగాల్ దంపతులు దరఖాస్తు చేసుకున్న మీదట గురువారం నాలుగేళ్ల మగ శిశువును కలెక్టర్ మధుమిత చేతుల మీదుగా అఽధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీ కుమార్ మహాపాత్రో, డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి మమతా శథపతి, తదితరులు పాల్గొన్నారు.