
కోలుకున్న నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, విపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి నవీన్ నివాస్‌కు సురక్షితంగా చేరారు. డీహైడ్రేషన్ కారణంగా చికిత్స కోసం ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఆయన ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజల ఆత్మీయ అనురాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆస్పత్రిలో తన బాగోగులు తెలుసుకునేందుకు సందర్శించిన ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, ఇరువురు మంత్రులు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్‌కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.
మాజీ గవర్నర్ పరామర్శ
ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

కోలుకున్న నవీన్ పట్నాయక్