
అరుదైన ఊసరవెల్లి
కొరాపుట్: అరుదైన ఊరసవెల్లిని గిరిజనులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి పటకలియా పంచాయితీ బడకనా గ్రామంలో ఊసరవెల్లిని గిరిజనులు గమనించారు. దీన్ని చూడడం అరిష్టమని వారు భావిస్తారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు గ్రామానికి చేరుకుని ఊసరవెల్లిని రక్షించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు. వారు దాన్ని అడవిలోకి విడిచిపెట్టారు.
దసరా ఉత్సవాలకు భూమిపూజ
రాయగడ: సదరు సమితి పరిధిలోని జేకేపూర్‌లో ఉన్న జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు గురువారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. జేకేపేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్లు ద్వివేది తెలియజేశారు. పూజా కార్యక్రమాల్లో మిల్ సీనియర్ ఉద్యోగులు బిశ్వజీత్ ద్వివేది, రాఘవేంద్ర హర్బర్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శిగా డాక్టర్ లలాటేందు సాహు
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఓఏఎస్ (ఎస్‌ఏజీ) అధికారి డాక్టర్ లలాటేందు సాహు నియమితులయ్యారు. ఒడిశా పర్యటన అభివృద్ధి కార్పొరేషన్ ఓటీడీసీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు బదిలీ చేసి ఈ నియామకం చేసినట్లు రాష్ట్ర సాధారణ పాలన, ప్రజాభియోగాల విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అరుదైన ఊసరవెల్లి