
నీట్ టాపర్ పూషన్ మహాపాత్రోకు అభినందనలు
భువనేశ్వర్: నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించిన పూషన్ మహాపాత్రో, ఆయన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అత్యున్నత ఉత్తీర్ణత సమగ్ర ఒడిశాకు సంతోషకరమని, ఇంత కఠినమైన పోటీ పరీక్షలో విజయం సాధించి సమగ్ర భారత దేశంలోనే మొదటి స్థానం సాధించడం కచ్చితంగా ఒక సవాలని అన్నారు. ఇలాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువతకు ఈ ఉత్తీర్ణత స్ఫూర్తిదాయకం అవుతుందని ముఖ్యమంత్రి అభినందించారు. మీలాంటి ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే మరియు ఔత్సాహిక వ్యక్తుల సేవలు రాష్ట్రానికి అవసరమని. శ్రీ జగన్నాథుడి కృపతో భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.