
నేటి నుంచి బొరిగుమ్మలో నిరవధిక బంద్
కొరాపుట్: రాష్ట్రంలో అతి పెద్ద సమితి బొరిగుమ్మలో నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తారా ప్రసాద్ బాహిణీపతి ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12 పట్టణాలకు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్‌ఏసి) ల హోదా ఇస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కానీ అందులో బొరిగుమ్మ పట్టణం లేదన్నారు. గత ప్రభుత్వం బొరిగుమ్మని ఏన్‌ఏఏసీగా ప్రకటించినప్పటికీ అధికారం కోల్పోవడం తో అది అమలు కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని కాబట్టి బొరిగుమ్మకి అన్యాయం చేసిందన్నారు. అందుకే గురువారం నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బొరిగుమ్మలో అన్నీ పార్టీలు ఈ బంద్‌ను సమర్థిస్తున్నాయని ప్రకటించారు. బంద్ జరిగితే ఆంధ్రా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచి పోతాయి.