
కొనసాగుతున్న భారీ వర్షాలు
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. గత 48 గంటలలో దాదాపు 300 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో నదులు, కొండవాగలు పొంగి పొర్లుతున్నాయి. విరామం లేకుండా వర్షాలు పడుతుండటం వలన బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీలో కంగుగుడ గ్రామం వద్దగల నది నీటి ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. దీంతో నదీ ప్రరివాహిక ప్రాంతంలోని కంగుగుడ, అటల్‌గుడ, జలియగుడ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆ నదిపై వంతెన లేక పోవటంతో కంగుగుడ, అటల్‌గుడ, జలియగుడ ప్రజలు తాడు సాయంతో ప్రమాదకరంగా నదిని దాటుతున్నారు. కంగుగుడ గ్రామం వద్ద గల నదిపై వంతెన నిర్మించాలని తాము ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టంచుకోవటవలేదని వారు తెలిపారు. సాధారణ రోజులలో నది దాటడానికి కష్టం కాదని, అయితే వర్షాకాలంలో నదిలో వరదపొంగి పొర్లుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.