
మునిగుడ బంద్ ప్రశాంతం
రాయగడ: పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రాయగడ జిల్లా మునిగుడ సమితిని ఎన్‌ఏసీగా గుర్తించాలని ఈ ప్రాంతీయులు కోరుతుతున్నారు. ఇదే డిమాండ్‌తో బుధవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. వాహనాల రాకకోకలను ఆందోళనకారులు నిలిపివేశారు. గత బీజేడీ ప్రభుత్వ హాయాంలో మునిగుడను ఎన్‌ఏసీగా గుర్తించినట్లు ప్రకటించనప్పటికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఏసి జాబితాలో విస్మరించిందని మునిగుడ ప్రగతి మంచ్ అధ్యక్షులు సీహెచ్ గణేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి మునిగుడను ఎన్‌ఏసిగా గుర్తించాలని కోరారు. లేదంటే భవిష్యత్‌లో తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మునిగుడ బంద్ ప్రశాంతం