
బాలల హక్కులపై అవగాహన అవసరం
● సామాజికవేత్త సీహెచ్ శాంతాకర్
కొరాపుట్: బాలల హక్కులపై అధికారులకు అవగాహన ఉండాలని కొరాపుట్ జిల్లాకి చెందిన బాలల హక్కులు, చైతన్య కార్యక్రమాలు నిర్హహించే సామాజిక వేత్త సీహెచ్ శాంతాకర్ అన్నారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మిష న్ శక్తి సమావేశ మందిరంలో బాలల హక్కులపై బుధవారం నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగపరంగా బాలల సంరక్షణకు కల్పిస్తున్న హక్కులను వివరించారు. బాల్య వివాహాలు అరికట్టడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్తుందన్నారు. పోక్సో చట్టంపై క్షుణ్ణంగా అవగాహనకు రావాలసిన అవసరం ఉందన్నారు. బాలకార్మిక వ్యవస్థను అరికట్టే విధంగా అధికారులు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని శాంతాకర్ పేర్కొన్నారు. శిబిరంలో కార్మిక, శిశు సంక్షేమ, పోలీసు, సాంఘిక సంక్షేమ, విద్యా శాఖల అధికారులు పాల్గొన్నారు.