
విస్తారంగా వర్షాలు
జయపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొరాపుట్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 880.32 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. జయపురం సబ్ డివిజన్ కోట్‌పాడ్ సమితిలో అత్యధికంగా 150 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అతి తక్కువ వర్షపాతం నారాయణపట్న సమితిలో 26.4 మి.మీ నమోదయ్యింది. అయితే బొయిపరిగుడ సమితిలో 143 మి.మీ, దశమంతపూర్‌లో 30 మి.మీ, లక్ష్మీపూర్‌లో 35.2 మి.మీ, సెమిలిగుడలో 53 మి.మీ, జయపురంలో 46.6 మి.మీ, కుంద్ర సమితిలో 42.4 మి.మీ, లమతాపుట్ సమితిలో 79 మి.మీ, పొట్టంగిలో 59.6 మి.మీ, మందుగాం సమితిలో 54 మి.మీ, నందపూర్ సమితిలో 55 మి.మీ, బొరిగుమ్మ సమితిలో 36 మి.మీ, కొరాపుట్ సమితిలో 73 మి.మీ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వర్షాలతో మాచ్‌ఖండ్, అప్పర్ కొలాబ్, తెలింగిరి జలాశయాల్లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీలో కంగుగుడ గ్రామం వద్ద నది నీటి ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. దీంతో ఆ నదీ ప్రవాహిక ప్రాంతంలోని కంగుగుడ, అటల్‌గుడ, జలియగుడ గ్రామాలతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.