
శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం
కేవీఐసీ డిప్యూటీ సీఈవో మదన్‌మోహన్‌రెడ్డి పొందూరు ఏఎఫ్‌కేకే సంఘా న్ని సందర్శించి హామీలివ్వడం వాస్తవమే. కొత్తవారికి వడుకు, నేత ప్రక్రియలపై శిక్షణలు ఇచ్చేందుకు కేవీఐసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణలిచ్చేందుకు ఏఎఫ్‌కేకే సంఘం సిద్ధంగా ఉంది.
– దండా వెంకటరమణ, సెక్రటరీ,
ఏఎఫ్‌కేకే సంఘం, పొందూరు
ఖాదీ వస్త్రాలు తయారు చేసేందుకు పొందూరు ఏఎఫ్‌కేకే సంఘాన్ని కేవీఐసీతో ట్రైనింగ్ పార్టనర్‌గా ఉండమని సూచించాం. పొందూరు ఖాదీని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివలన కొత్తతరం వారు ఈ వృత్తిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా వడుకు, నేత ప్రక్రియలో శిక్షణ ఇచ్చేందుకు పొందూరు ఖాదీ సంస్థకు దరఖాస్తు చేయమని చెప్పాను. శిక్షణ ముగించుకున్న వారికి సర్టిఫికెట్లు సైతం అందజేస్తాం. ఏ జిల్లా నుంచైనా శిక్షణలకు పొందూరుకు రావచ్చు. వడుకు, నేత పని నేర్చుకోవచ్చు.
– మదన్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈవో,
బెంగుళూరు, కేవీఐసీ
ఎక్కువ కార్మికులు ఉండడం గమనార్హం. మాస్టర్ వీవర్స్ నేసే వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సొసైటీలు, సంఘాలకు నేసేవారికి ప్రభుత్వ సహకారం అందించాలి. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి సౌసైటీలు, సంఘాలకు నేసే కార్మికులకు వర్తింపజేయాలి. దుస్తులు నేసే వారికి షరతులు ఉండకూడదు. ఉదాహరణకు పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో ఏఎంసీ, ఎన్‌ఎంసీ వస్త్రాలు మాత్రమే లభిస్తున్నాయి. సీమనూలుతో నేసే వస్త్రాల తయారీ ఇక్కడ లేదు. అందువలన ఏరకమైన నూలుతోనైనా వస్త్రాలు తయారు చేయోచ్చన్న అనుమతి కేవీఐసీ నుంచి రావాలి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కార్మికులకు ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారు.