
బొరిగుమ్మలో ఘనంగా నందోత్సవాలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలో నందోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. సాధారణంగా కృష్ణాష్టమి మరుసటి దినాన గోపాలకుల దినం లేక నందోత్సవంగా పాటిస్తారు. ఈ ఉత్సవాన్ని బొరిగుమ్మలో అనాదిగా వంశ పారంప ర్యంగా నిర్వహిస్తున్నారు. పురాతన వైష్ణవ సంప్రదాయ వై.కృష్ణ స్వామి కుటుంబం, బొరిగుమ్మ నవరంగపూర్ రోడ్డులోని కృష్ణ స్వామి నివాసంలో అంగ రంగౖ వెభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన నందోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని శ్రీకృష్ణునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్బంగా భజన సంకీర్తనలు నిర్వహించారు.