
సెంచూరియన్ వర్సిటీలో జాతీయస్థాయి సెమినార్
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ లో జాతీయ సాంకేతిక విద్యావ్యవస్థ (ఎన్‌ఐటీ) సహకారంతో ‘నెక్ట్స్ జనరేషన్ వైర్‌లెస్ కమ్యూనికేషన్–ఎనర్జీ హార్‌వెస్టింగ్ టెక్నాలజీ’పై జాతీయ స్థా యి అధ్యాపక శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ఎన్‌ఐటీ (పాట్నా) డైరెక్టర్ ప్రొఫెసర్ పి.కె.జైన్, సెంచూరియ న్ వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ సుప్రియా పట్నాయక్‌లు ప్రారంభించారు. దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాల ప్రొఫెసర్, అధ్యాపకులు పాల్గొన్నా రు. శిక్షణ కార్యక్రమంలో 5జీ, 6జీ సిస్టం, ఎల్‌ఓటీ, ఆర్‌ఎఫ్, ఎనర్జీ హార్‌వెస్టింగ్, స్మార్ట్ కమ్యూనికేషన్ పై విస్తృతంగా చర్చించారు. శిక్షణ తరగతులు ఈ నె ల 29వ తేదీ వరకూ జరుగుతాయని డీన్ (కంప్యూటర్ సైన్సు) ప్రఫుల్ల పట్నాయక్ తెలియజేశారు.