
ఆదిత్యుని సన్నిధిలో న్యాయమూర్తి తుహిన్ కుమార్
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ సతీసమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవంగా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలను చేయించి, ఆలయ విశిష్టతను శంకరశర్మ వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. వారితో పాటు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష తదితరులు ఉన్నారు