
నవీన్ నివాస్‌లో కలుద్దాం
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తు తం చికిత్స పొందుతున్నారు. ఆయనను చూడటానికి వస్తున్న సందర్శకులకు ఆత్మీయ సందేశాన్ని సోమవారం ఆస్పత్రి నుంచే జారీ చేశా రు. నన్ను కలవాలనుకుంటే, దయచేసి నవీన్ నివాస్‌కి రావాలన్నారు. తాను వైద్యుల సంరక్షణలో ఉన్నప్పుడు ప్రజలు ఆస్పత్రి సందర్శనకు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజల మమతానురాగాలకు నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
పర్లాకిమిడి: గజపతి మార్కెట్‌లో కాయగూరల వ్యాపారి బల్ల మహేష్‌పై కాంగ్రెస్ నాయకుడు బసంత పండా, చిల్లర వ్యాపారులు ఆదర్శ పోలీసు ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవా రం సంక్రాంతి నాడు మార్కెట్‌కు బంద్ సంద ర్భంగా కాయగూరల అమ్మకాలు మూసివేయించారన్నారు. చాలక రాజవీధి, మెడికల్ జంక్షన్, పాత కోర్టు జంక్షన్ వద్ద చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న మహిళా వ్యాపారులపై దౌర్జన్యం చేశాడని, సంక్రాంతి నాడు కూరగాయాలు అమ్మ కూ డదని రోడ్డుపై విసిరేశాడన్నారు. ఐఐసీ ప్రశాంత్ భూపతిని బసంత్ పండా, లోకనాథ మిశ్రా, సూర్యనారాయణ పాత్రో సనోజ్ పట్నాయక్ కలిసి ఫిర్యాదు చేశారు. గజపతి మార్కెట్‌లో కొంతమంది గూండాయిజం చెలాయిస్తున్నార ని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బసంత్ పండా కోరారు.
రిమ్స్‌లో యువకుడి
అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి లో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ముర పాక అక్కయ్య (30) పచ్చ కామెర్ల వ్యాధితో ఇటీవల చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రిలో చేరా డు. సోమవారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఉన్న బాత్రూమ్ వైపు అక్కయ్య వెళ్లాడు. తిరిగి వస్తుండగా జారిపడి స్పృహ కోల్పోయాడు. అక్కడికి కొద్ది సమయంలోనే వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించినా మృతికి గల కారణాలు తెలియరాలేదు. రోగి కుటుంబ సభ్యులు బాత్రూమ్‌కు వెళ్లక ముందు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియ దని వాపోతున్నారు. ఇదే విషయమై అవుట్ పోస్టు పోలీసుల వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా వైద్యులు సాధారణ మరణంగా ధ్రువీకరించి పంపించేశారన్నారు. బాత్రూమ్ లో పడిపోవడం వాస్తవమేనని పేర్కొన్నారు.
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలో జలుమూరు మండలంలోని గోటివాడ గ్రామానికి చెందిన ముక్త పవన్ కుమార్ (25) విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గత రెండు రోజులు సెలవులు కావడంతో ఇంటికి వచ్చి ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యాడు. జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10 గంటల సమయంలో లావేరు మండలంలోని తాళ్లవలస వచ్చేసరికి ముందు వెళ్తున్న ఆటో సడన్‌గా రోడ్డుపై నీరు ఉందని తిప్పాడు. దీంతో ఆటోను తప్పించి అధిగమించే క్రమంలో వెనువెంటనే వెనుక వచ్చిన వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి నరిసింగరావు, తల్లి ఉషారాణి, సోదరుడు సాయి ఉన్నారు. రోడ్డు ప్రమాదంపై లావేరు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

నవీన్ నివాస్‌లో కలుద్దాం

నవీన్ నివాస్‌లో కలుద్దాం

నవీన్ నివాస్‌లో కలుద్దాం