
అభివృద్ధి పనుల పరిశీలన
రాయగడ: రాష్ట్ర పంచాయతీ, నీటి పారుదల శాఖ ల కార్యదర్శి ఎస్.ఎన్.గిరీష్ జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిఽధిలో గల పద్మపూర్, గుణుపూర్ సమితుల్లో సోమవారం పర్యటించారు. ఆయా సమితుల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుణుపూర్‌లో గల సబ్ డివిజన్ హాస్పిటల్‌ను పరిశీలించి రోగులతో మాట్లాడారు. హాస్పిటల్‌లో అందుతున్న సౌకర్యాలు, ఎదురువుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి రొగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం సమితిలోని సానసారి, కులుసింగి గ్రామాల్లో పర్యటించారు. వికసిత్ ఒడిశా ద్వారా నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి పనులను సమీక్షించా రు. ఆయా ప్రాంతాల్లో ఈ పథకంలో నిర్మితమవుతున్న ఇళ్లను, లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. కులుసింగ్‌లో జరుగుతున్న ప్రధానమంత్రి జన్‌మన్ పథకాన్ని పర్యవేక్షించారు. గ్రామస్తులతో చర్చించా రు. అనంతరం పుటాసింగిలో పర్యటించిన ఆయన ఎస్‌ఎస్‌డీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. మధ్యా హ్నం భోజన ఎలా ఉంది, సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సమితిలోని రైజింగ్ తల్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించా రు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారా అని అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ పర్య టనలో గుణుపూర్ సబ్ కలెక్టర్ దుధల్ దిలీప్ అభి షేక్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయకుమార్ ఖెముండొ పాల్గొన్నారు. కార్యదర్శి గిరీష్‌కు లంజియా సవర లిపికి సంబంధించిన పెయింటింగ్‌ను అధికారులు బహూకరించారు.