
● ప్రగతికి రెక్కలు
● భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభం
భువనేశ్వర్: ప్రాంతీయ అనుసంధానం, సమ్మిళిత వృద్ధిని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య ప్రత్యక్ష విమాన సేవలను లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్ర మార్గదర్శక ఏవియేషన్ ఆస్తులు, నెట్‌వర్క్ నిర్మాణం, నిర్వహణ (బి–మాన్) పథకం కింద ఈ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించారు. ఈ నెల 24 నుంచి పూర్తి స్థాయిలో ఈ సేవలు లభ్యమవుతాయి. వారానికి 4 రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య 76 సీట్ల ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి జెండా ఊపి ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సేవలకు కొత్త గమ్యస్థాన విధానం కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ద్వారా మద్దతు లభిస్తుందన్నారు. భువనేశ్వర్, ఝార్సుగుడ మధ్య ప్రత్యక్ష విమాన సేవలు పశ్చిమ ఒడిశాను రాష్ట్ర రాజధానికి దగ్గరగా తీసుకురావడంతో పారిశ్రామిక వృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి, సామాజిక, ఆర్థిక పురోగతికి గణనీయంగా ప్రోత్సహిస్తుందన్నారు. అందరి విమానయానం కలను సాకారం చేసేదుకు రాష్ట్ర వాణిజ్య, రవాణా శాఖ ప్రాంతీయ వాయు నెట్‌వర్క్‌లను విస్తరణతో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో నిబద్ధతను పునరుద్ఘాటించిందన్నారు.

● ప్రగతికి రెక్కలు

● ప్రగతికి రెక్కలు