
నవీన్ పట్నాయక్‌కు అస్వస్థత
భువనేశ్వర్: రాష్ట్ర ప్రతిపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
నవీన్ పట్నాయక్‌కు మంత్రి పరామర్శ
భువనేశ్వర్: ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో సంప్రదించి చికిత్స, వైద్యం, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైతే విపక్ష నేత చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి ప్రకటించారు.
చికిత్సకు స్పందిస్తున్నారు..
నవీన్ పట్నాయక్ ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు డీహైడ్రేషన్ కారణంగా స్థానిక సమ్ అల్టిమేట్ మెడికేర్‌లో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్సకు బాగా స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు సమాచారం జారీ చేశాయి.
హోంగార్డు అభ్యర్థుల ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో హోంగార్డు పోస్టులకు ఇటీవల శారీరిక, రాత పరీక్షలు జరిగి ఫలితాలను జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా శనివారం ప్రకటించారు. మొత్తం 144 పోస్టులకు 128 మంది జాబితా విడుదల చేశారు. కొంతమంది పరుగుపందెం పోటీలో అర్హత సాధించలేని అభ్యర్థులు కూడా జాబితాలో ఉన్నాయని, ఈ హోంగార్డు నియామకాల్లో అవకతవకలు జరిగాయన్నారు. బెత్తగుడ వద్ద జిల్లా పోలీసు బారక్ వద్ద ఆదివారం కొందరు నిరసన తెలిపారు. ఫలితాలు ప్రకటించిన తరువాత అభ్యర్థులు అభ్యంతరం లేవనెత్తడం ఏమిటని పోలీసు అధికారులు చెబుతున్నారు.
బైకు దొంగలు అరెస్టు
రాయగడ: జిల్లాలోని శశిఖాల్ పోలీసులు బైకుల దొంగతనం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండగా మరో ఇద్దరు యువకులు స్థానిక రెల్లివీధికి చెందిన అడప నిఖిల్, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా పార్వతీపురం మండలం గుమడ గ్రామానికి చెందిన కుప్పిలి శేఖర్‌లు ఉన్నారు. వారి నుంచి రెండు బైకులు, ఒక స్కూటీ, రెండు మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు తరలించారు.

నవీన్ పట్నాయక్‌కు అస్వస్థత