
గోపాల సమాజ్ సేవలు చిరస్మరణీయం
జయపురం: గోపాల సమాజ్ సమాజానికి అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. ఆదివారం స్థానిక టౌన్ హాలు ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా క్షొహల్‌ఖండ్ గోపాల్ సమాజ్ నిర్వహించిన నందోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యవక్తగా పాల్గొన్న సాహితీవేత్త డాక్టర్ సురేష్ దాస్ మాట్లాడుతూ గోపాల జాతిలో అనేక మంది మహానుభావులు ఉన్నారని తెలిపారు. కవిరాజ్ పరమేశ్వర పాత్రో అధ్యక్షతన జరిగిన నందోత్సవ కార్యక్రమంలో జయపురం మున్సిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, జిల్లా యాదవ మహాసభ అధ్యక్షులు మదన మోహన నాయిక్, మాజీ కౌన్సిలర్ బినోద్ మహాపాత్రో, బీజేడీ నేత బాలారాయ్, జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షులు హరహర కరసుధా పట్నాయిక్ తదితరులు ప్రసంగించారు.

గోపాల సమాజ్ సేవలు చిరస్మరణీయం