
గంజాయితో ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు శుక్రవారం రాత్రి కోరుకొండ సమితి నీలాద్రినగర్ పంచాయతీ సోరలకొండ బ్యారేజీ వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అతివేగంగా రావడం గమనించి వారితో ఉన్నటువంటి బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీల్లో గంజాయి బయటపడడంతో వారిని అరెస్టు చేసి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్కన్‌గిరి సమితి ఎంవీ 25 గ్రామానికి చెందిన రాఖల్ వాలా, జ్యూటిపల్లి గ్రామానికి చెందిన భీమా పోడియామిలుగా తెలిపారు. వీరు ఈ గంజాయిని ఎంవీ 120 గ్రామంలో కొని మల్కన్‌గిరికి తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని తూకం వేయగా 7 కిలోలు ఉందని, దీని విలువ రూ.50 వేలు వరకు ఉంటుందని బలిమెల ఐఐసీ ధీరాజ్ పట్నాయిక్ వెల్లడించారు. నిందితులను సోమవారం కోర్టుకు తరలిస్తామన్నారు.