
హైకోర్టు జడ్జి ఇంట సందడి
వీరఘట్టం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గేదెల తుహిన్‌కుమార్ ఇంట వద్ద శనివారం సందడి నెలకొంది. ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామమైన వీరఘట్టం మండల కత్తులకవిటి గ్రామానికి వచ్చారు. దీంతో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నేతలు, అధికారులు క్యూ కట్టారు. హైకోర్టు జడ్జిగా ఈ ప్రాంతానికి చెందిన మీరు ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. జడ్జి తుహిన్‌కుమార్‌ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే వీరఘట్టం, పాలకొండ, రేగిడి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కె.సూర్యప్రకాశరావు, డి.వెంకటరమణనాయుడు, కర్రి గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావు తదితరులు కలిశారు. వీరఘట్టం తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు తదితరులు జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసుల అదుపులో పొట్టేళ్ల పందెంరాయుళ్లు
గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు శనివారం తెలిపారు. ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న ప్రదేశంలో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. రెండు పొట్టేళ్లను, రూ.1680 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.
నూతన బార్ పాలసీ విడుదల
విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్లు 275, 276 ప్రకారం 2025–2028 సంవత్సరాలకు సంబంధించి నూతన బార్ పాలసీలను విడుదల చేసినట్టు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ ము న్సిపాలిటీ, నగర పంచాయతీలలో గల 282బి బార్స్ నోటిఫై చేశామన్నారు. వీటిలో మూడు టూబీ బార్స్ కళ్లు గీత కులాలకు కేటాయించామన్నారు. ఈ వేలం ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీ, నగర పంచాయతీలో ఎనిమిది 2బి బార్స్‌ను నోటిఫై చేశామన్నారు. వాటిలో రెండు 2బి బార్స్ కళ్లుగీత కులాలకు కేటాయించామన్నారు. ఆసక్తి గలవారు వారి పరిధిలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్‌లలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 9440902360, 9440902362 (విజయనగరం), 8348523855, 9398630486 (పార్వతీపురం మన్యం) నంబర్లను సంప్రదించాలని సూచించారు.
నేత్ర శస్త్ర చికిత్సకు 20 మంది ఎంపిక
పూసపాటిరేగ: మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన నేత్ర వైద్య శిబిరానికి హాజరైన 180 మందిలో వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న 20 మందిని నేత్ర శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరి కళ్లను వైద్య సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు చేసి, ఏవైనా సమస్యలుంటే చెప్పి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ టొంపల సీతారాం, స్వామి కంటి ఆస్పత్రి వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ స ర్కిల్ పరిధిలోని విజయనగరం రూరల్, గంట్యాడ పోలీస్టేషన్‌ల సిబ్బందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు శనివారం చేసినట్లు విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. విజయనగరానికి చెందిన మ్యాక్సి విజన్ మల్టీ స్పె షాలిటీ ఆస్పత్రి వారు వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి, అవసర మైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
శృంగవరపుకోట: ఓటర్లను చైతన్యపరచి వారికి తమ హక్కులు, విధులు, బాధ్యతలను తెలియచెప్పడమే లక్ష్యంగా ఓటరు అక్షరాస్యత వేదిక పని చేస్తోందని వేదిక అధ్యక్షుడు సూర్యారావు తెలిపా రు. ఓటరు అక్షరాస్యత వేదిక ద్వితీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం రాత్రి స్థానిక లైబ్రరీలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వైద్యులు ఆర్.త్రినాధరావు, పి. వరలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఓవరాల్ విజేతలైన జి.భవిష్య, బి.తేజస్విని, బి.ఊహలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ డి.శ్రీధర్, మోహన్‌రావు, చిన్నికృష్ణ, ఎల్.సాంబమూర్తి, తాతారావు, బి.అప్పారావు, పి.శ్రీనివాసరావు, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు జడ్జి ఇంట సందడి