
18 నుంచి ఆలా హజరత్ ఉత్సవాలు
విజయనగరం టౌన్: దేశ వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ఆలా హజరత్ ఉత్సవాలను సున్నీ మసీదుల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు పట్టణ శాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.కోట, కురుపాం, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న మసీదుల్లో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఆబాద్ వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియాతుల్ హబీబియా అహ్‌మదీయా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం భారీ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు.
స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు
విజయనగరం క్రైమ్: నగరంలోని ఏడు స్పా(మసాజ్) సెంటర్లలో వన్‌టౌన్ పోలీసులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసా జ్ సర్వీసుకు వచ్చే సీ్త్ర, పురుషులను వేర్వేరుగా ఉంచాలని సీఐ ఆర్‌వీకే చౌదరి నిర్వాహకులకు సూచించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేర కు సీఐ చౌదరి, ఎస్‌ఐలు రామ్‌గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్రనాయుడులు మసాజ్ కేంద్రాలకు వెళ్లి, పరిశీలించారు. తప్పనిసరిగా కేంద్రంలో అర్హులైన ఫిజియోథెరపిస్ట్‌లు ఉండాలన్నారు. రాత్రి వేళల్లో స్పా సెంటర్‌లకు అను మతి లేదని, ఎవరూ నిర్వహించవద్దన్నారు.
అక్రమంగా పశువుల తరలింపు
కొమరాడ: ఒడిశా నుంచి పార్వతీపురం సంతకు కొమరాడ మీదుగా జాతీయ రహదారిపై మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. బొలెరా వంటి వాహనాల్లో వందల సంఖ్యలో పశువులను అక్రమంగా తరలించేస్తున్నారు. వీటి రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఏమీ చూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. వీటిని కబేళాలకు తరలిస్తున్నట్టు అధికార యంత్రాంగానికి తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై దుమారం రేగుతోంది. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై వందలాది పశువులను తరలిస్తూ అక్రమ సంపాదనపై అక్రమార్కులు గురి పెట్టినా నిఘా వర్గాలకు ఏమీ పట్టడం లేదు. మరోవైపు వందలాది కిలోమీటర్ల పొడవునా వీటిని నడిపిస్తూ కూడా కబేళాలకు తరలిస్తున్నా ఇటు పోలీసులకుగాని, అటు జంతు సంక్షేమ సంఘాలకు అనుమానం కలగకపోవడం విశేషం. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీగి మూగజీవాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

18 నుంచి ఆలా హజరత్ ఉత్సవాలు