
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
మొక్కలు పెరిగే దశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలు పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోసిన తరువాత పూల గుత్తిలను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పూల దిగుబడి పెరుగుతుంది. మొక్కలు నాటిని రెండు లేక మూడు నెలలకు పూత వస్తుంది. జూన్ నుంచి జనవరి వరకు పూత బాగా ఉంటుంది. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. రెండు రోజులకు పూలు విచ్చుకొంటాయి. ఉదయం లేదా సాయంకాలం మాత్రమే పూలు కోయాలి.
– కొల్లి తిలక్, వ్యవసాయాధికారి, భామిని