
రెండు ద్విచక్ర వాహనాల దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని టీకే రాజపురం గ్రామస్తులు శుక్రవారం పాలకొండ పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన జాడ దుర్గారావు అలియాస్ చిన్న అనే వ్యక్తి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్దింటి సూరిబాబుకు చెందిన ఎక్సెల్ వాహనంతో పాటు దోర భానుప్రసాద్‌కు చెందిన డీలక్స్ ద్విచక్ర వాహనం దగ్ధం చేశాడని ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి వద్ద వాపోయారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

రెండు ద్విచక్ర వాహనాల దగ్ధం