
ఎడతెరిపి లేకుండా వర్షం
● రాకపోకలకు అంతరాయం
మల్కన్‌గిరి: జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కలిమెల సమితి ఎంవీ 96 వంతెనపై శనివారం ఉదయం సుమారు 3 అడుగుల మేరకు వరద నీరు ప్రవహించింది. దీంతో మల్కన్‌గిరి నుంచి కలిమెల మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వెళ్లే బస్సులు వంతెన వద్దనే నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు, భువనేశ్వర్ నుంచి మోటు వైపు వెళ్లే బస్సులను సైతం నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఎడతెరిపి లేకుండా వర్షం