
సిండ్రుబ గ్రామానికి ఎమ్మెల్యే రూపేష్
పర్లాకిమిడి: గుమ్మా బ్లాక్‌లోని భుభుని పంచాయతీ మారుమూల సిండ్రుబ గ్రామంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పర్యటించారు. గ్రామంలోని సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 2019లో వచ్చిన తుఫాన్ ప్రభావంతో కొండచరియలు విరిగిపడి గ్రామంలోని అనేక ఇల్లు నేలమట్టం అయ్యాయి. గ్రామంలో ప్రస్తుతం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ తాగునీరు, రోడ్డు, పాఠశాల సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. గ్రామంలో త్వరితగతిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు గుమ్మా బీడీవో దులారాం మరాండి, గుమ్మా బ్లాక్ చైర్మన్ సునేమీ మండల్, బీజేడీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌నాయక్ తదితరులు ఉన్నారు.

సిండ్రుబ గ్రామానికి ఎమ్మెల్యే రూపేష్