
వాజపేయికి నివాళి
రాయగడ: భారత మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారి వాజపేయి వర్ధంతి కార్యక్రమం బీజేపీ శ్రేణులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు కీర్తిచంద్ర సాహు, బాదల్ ద, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు, బసంత ఉల్క, కలిరామ్ మాఝి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: స్థానిక ఇరదల వీధిలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి నిర్వహించారు.
వాజపేయి దేశానికి చేసిన సేవలను సీనియర్ నాయకుడు ఛిత్రి సింహాద్రి కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, కోట్ల యువరాజ్, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, కృషక్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ పాలో తదితరులు పాల్గొన్నారు.

వాజపేయికి నివాళి