
రాయగడలో ‘చదువుకుందాం రండి’
రాయగడ: విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. అందరికీ విద్య, అందరూ చదువుకోవాలి అనే నినాదంతో పట్టణంలోని ఇందిరానగర్, అశోక్‌నగర్ ప్రాంతాల్లో చదువుకుందాం రండీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మెట్రిక్ సప్లిమెంటరీ
పరీక్షల ఫలితాలు వెల్లడి
భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్‌ఈ) నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన 3,457 మంది విద్యార్థుల్లో, 1,944 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత రేటు 56.23గా నమోదు అయింది. ఈ ఫలితాలతో పాటు రాష్ట్ర ఓపెన్ స్కూల్ (ఎస్‌ఓఎస్) పరీక్ష ఫలితాలను వెల్లడించారు. 10,809 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 5,973 మంది ఉత్తీర్ణత సాధించారు. 55.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.
శ్రీమందిరం శిఖరం
ఎక్కేందుకు ప్రయత్నం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం శిఖరంపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన యాత్రికుడు పోలీసులకు పట్టుబడ్డాడు. బెహరొణొ ద్వారం వైపు నుంచి శిఖరం పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా శ్రీజగన్నాథ ఆలయం పోలీసుల (ఎస్‌జేటీపీ) దృష్టిలో పడింది. దాదాపు 5 నుంచి 7 అడుగుల వరకు పైకి ఎక్కిన తర్వాత అతడిని గుర్తించారు. ఈ యాత్రికుడు బీహార్ (రాంచీ)కు చెందినవాడిగా కనుగున్నారు. స్థానిక సింహద్వారం ఠాణా పోలీసుల అదుపులో ఉన్నాడు.

రాయగడలో ‘చదువుకుందాం రండి’

రాయగడలో ‘చదువుకుందాం రండి’