
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
జయపురం: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోట్‌పాడ్ ఎకై ్సజ్ అధికారి నీలాద్రి బిహారి మిశ్ర అన్నారు. జయపురం సమితి కోట్‌పాడ్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిషా నివారణపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల వలన కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తప్పటడుగులు వేస్తున్న పరిణామం సమాజానికి చేటు అన్నారు. అందువలన మత్తు పదార్థాలపై గ్రామాల్లో విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం పొణిరో సాగర్, ఉపాధ్యాయులు సుజిత్ సర్కార్, రొతికాంత మహంతి, మహిమ ముండ, శుభాషిష్ పండ, ఆకాశ బిబార్, ప్రభాషిణీ లామాల్, దమయంతి సాహు, సయిత గొలారి తదితరులు పాల్గొన్నారు.