
మద్యం కోసం దారుణం
● భార్యను హత్య చేసిన భర్త
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధి భువనపల్లి పంచాయతీ గిన్నిపల్లి గ్రామంలో భీమ కుంజ అనే వ్యక్తి భార్య భారతి కుంజ (40)ను శనివారం దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. భీమ తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు కొద్ది రోజులుగా నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతూ కొడుతున్నాడు. ఈ నేప థ్యంలో శనివారం భారతి పనికి వెళ్తూ భర్త తీసుకొచ్చిన మద్యం అతడికి దొరకకుండా దాచిపెట్టింది. అది తెలుసుకున్న భీమ పొంలం వద్దకు వచ్చి మ ద్యం ఎక్కడ దాచావని అడుగుతూ భార్యను కొట్టా డు. అయినా ఆమె చెప్పకపోవడంతో అక్కడే ఉన్నటువంటి కత్తితో పొడిచి చంపేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చారు. అయితే ఎవరైనా సాక్ష్యం చెబితే వారిని సైతం చంపుతానని భయపెట్టాడు. చివరికి గ్రామస్తులంతా కలిసి అతడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ చంద్రకాంత్ తండి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.