
విజిలెన్స్ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
పర్లాకిమిడి: స్థానిక జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తా జగదీష్ పట్నాయక్, అటెండర్ నిరంజన్ నాయక్‌లు ఒక యువ డాక్టర్ వద్ద నుంచి రూ.25 వేల లంచంగా తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న కాంట్రాక్ట్ డాక్టర్‌గా ఉద్యోగం పొందిన వ్యక్తి అపాయింట్‌మెంటు లెటర్ కోసం సి.డి.ఎం.ఓ. కార్యాలయానికి వెళ్లారు. గుమస్తా జగదీష్ పట్నాయక్, ప్యూన్ నిరంజన్ నాయక్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన విజిలెన్స్ అధికారులకు తెలియజేయడంతో వలపన్ని పట్టుకున్నారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జగదీష్ పట్నాయక్ ప్రభుత్వ క్వార్టర్, కార్యాలయంలోని ఆయన సీటు అల్మారా, డెస్‌లో వెతకగా సుమారు రూ.5 లక్షలు ఉండటంతో వాటిని సీజ్ చేశారు. ఈ దాడుల్లో బరంపురం విజిలెన్స్ పాల్గొన్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేసి, కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు.
రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

విజిలెన్స్ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు